

జనం న్యూస్ మార్చి 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దాహం, డీహైడ్రేషన్, వడదెబ్బ, జీర్ణ సమస్యలు, చర్మ వ్యాధులు వంటి సమస్యలు వేడికి సంబంధించిన ప్రతికూల ప్రభావాలుగా కనిపిస్తాయి.
వేసవి కాలంలో ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలు డీహైడ్రేషన్ వడదెబ్బ అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది, దాంతో శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ లోపించి అలసట, తలనొప్పి, వడదెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది.ఎండలో ఎక్కువసేపు ఉన్నప్పుడే కాకుండా, తగినంత నీరు తాగకపోయినా డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. ఆస్తమా ఊపిరితిత్తుల సమస్యలు వేసవిలో గాలి పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆస్తమా శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.ధూళి, పొగ, పొల్యూషన్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండటాన్ని నివారించాలి.ఆస్తమా ఉన్నవారు తమ వెంట ఇన్హేలర్ మెడిసిన్స్ తప్పనిసరిగా ఉంచుకోవాలి. చర్మ సమస్యలు అలర్జీలు చెమట అధికంగా కారడం వల్ల చర్మం మురికితో ముడిపడి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, రాషెస్ ఏర్పడతాయి.శోభి మచ్చలు తినియా వెర్సికలర్ వేసవిలో అధికంగా ప్రబలతాయి.యూవీ రేడియేషన్ కారణంగా చర్మం కమిలిపోవడం, సన్‌బర్న్, మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది. విరేచనాలు కలరా. వేసవిలో భోజనం త్వరగా పాడవడం, నీటి కాలుష్యం పెరగడం వల్ల విరేచనాలు, కలరా వంటి సమస్యలు వస్తాయి.రహదారి పక్కన ఉన్న ఆహారం, కలుషితమైన నీరు తాగడం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కిడ్నీ సమస్యలు వేసవిలో నీటి తగ్గుదల వల్ల మూత్రంలో మలినాలు పేరుకుని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు యు టి ఐ సోకే అవకాశం ఉంటుంది.తగినంత నీరు తాగకపోతే కిడ్నీ రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువ. వేసవి జాగ్రత్తలు నివారణ చర్యలు
రోజూ కనీసం ముడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగాలి. ఒకసారి ఉడికించిన లేదా ఫిల్టర్ చేసిన నీరు తాగాలి. పొడిగా, వేడిగా ఉండే ఆహారాన్ని తగ్గించి, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం ఉత్తమం. పొడిపోతే ఊపిరితిత్తుల సమస్యలున్నవారు వైద్యుల సూచనల ప్రకారం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ నీరు తాగాలి, ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి.
ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల సన్‌బర్న్, డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి, కాబట్టి సన్‌స్క్రీన్ వాడడం, హాట్ టైమ్‌లో బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది. హైడ్రేటింగ్ ఫుడ్స్ కాకర, దోసకాయ, ముజ్జిగ, కొబ్బరి నీరు తినడం వల్ల వేడి తగ్గుతుంది. వేసవిలో ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సరైన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలి