

జనం న్యూస్ జనవరి 12 : చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ప్రశాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో పతంగులకు చైనా మాంజా పూయడం వల్ల , మనుషులతో పాటు, పక్షులకు సైతం ప్రమాదం పొంచి ఉందని, ఆయన అన్నారు, సంక్రాంతి సంబరాలలో భాగంగా వ్యాపార సముదాలను ఆకస్మిక తనిఖీ చేపడతామని, చైనా మాంజ అమ్మిన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.