Listen to this article

జనం న్యూస్ 10 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈనెల 12న జిల్లా కేంద్రంలో యువత పోరు ధర్నా నిర్వహిస్తున్నట్లు జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేద విద్యార్థులు, నిరుద్యోగుల తరఫఉన కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యామని చెప్పారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించామని, క్స్కీ రీయింబర్సె కట్‌, నిరుద్యోగ భృతిపై నినదిస్తామన్నారు. వైసీపీ శ్రేణులు, విద్యార్థులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.