

జనం న్యూస్ కాట్రేనికోన, మార్చి 10 : క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ చిత్రకా రులు అంజి ఆకొండి ఆధ్వర్యంలో కాట్రేనికోనలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ అమలాపురం డిఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్ చేతులు మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. గత పది సంవత్సరాలుగా చిత్రకళలో ఎనలేని కృషి చేస్తూ రాష్ట్రస్థాయి మరియు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను పురస్కారాలు అందుకుని జాతీయ స్థాయి లో కొన్ని వందలమంది విద్యార్థులకు చిత్రకళలో శిక్షణ ఇస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియం, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో కూడా క్రియేటివ్ హార్ట్స్ సంస్థ ద్వారా వందల సంఖ్యలో చిత్రకారులతో చిత్రకళ ప్రదర్శనలు చేయడం జరి గింది. అదే స్ఫూర్తితో పల్లెటూరిలో సైతం చిత్రకళ మీద అందరి ప్రోత్సాహం అందించాలని చిత్రకళ మీద ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరి ప్రదర్శన చేసే అవకాశం లభించాలని సదుద్దేశ్యంతో ఈ ఆర్ట్ గ్యాల ఏర్పాటు చేస్తునట్లు అంజి ఆకొండి తెలిపారు. ఈ కార్య క్రమంలో ప్రముఖ చిత్రకారులకు గౌరవ సత్కారాలు చేస్తున్నట్లు ఆయన తె పారు. ఈ కార్యక్రమానికి అమలాపురం డిఎస్పీ ప్రసాద్ ముఖా అతిథిగా విచ్చేసి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొల్ల కోటి వెంకటరెడ్డి ,పాలకొల్లు ప్రముఖ చిత్రకారులు మార్లపూడి ఉదయ్ కుమార్ని చిత్రా కళా తపస్వి అనే బిరుదుతో సత్కరించడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన 60 మంది చిత్రకారులకు బహుమతులు అందజేశారు
