

నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు ఆపదలో అండగా బుసిరెడ్డి పాండురంగారెడ్డి జనం న్యూస్ -మార్చి 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు నేనున్నానంటూ భరోసాని కల్పిస్తున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, నాగార్జునసాగర్ హిల్ కాలనీ నివాసితులైన కంచర్ల వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా పక్షవాతానికి గురై బాధపడుతున్నారని కొమ్ము రాందాస్ ద్వారా తెలుసుకొని వారి కుటుంబానికి నేనున్నానంటూ భరోసానిస్తూ ఆర్థిక సహాయం అందజేసిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా తమ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు, బుసిరెడ్డి ఫౌండేషన్ పేదలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తమ ఫౌండేషన్ ద్వారా సహాయం కావలసినవారు తమను సంప్రదించగలరని తెలిపారు, ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బుర్రి రామ్ రెడ్డి ,ఎస్సీ నాయకులు ఆదాసు విక్రమ్, బనావత్ శీను నాయక్, విక్రమ్ నాయక్, హేమలత, అబ్దుల్ కరీం, గడ్డం సజన్, నాగార్జున రెడ్డి, లింగస్వామి, రమేష్ ఆచారి ,భాస్కర్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.