

హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు, స్థానిక వార్డు ప్రజలు జనం న్యూస్- మార్చి 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ 9వ వార్డు లోని బీసీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి, ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నందికొండ మున్సిపాలిటీ పరిధిలో కొన్నిచోట్ల సిసి రోడ్లు వేసిన పూర్తిస్థాయిలో సిసి రోడ్లను వేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురయ్యామన్నారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక శాసనసభ్యులు కొండూరు జైవీర్ రెడ్డి కృషితో ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో తమ నివాసాల వద్ద సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నందుకుగాను కృతజ్ఞతలు తెలియజేశారు సబ్ ప్లాన్ నిధులలో 26 లక్షల రూపాయల వ్యయంతో 500 మీటర్ల మేర సిసి రోడ్లు వేయనున్నారని తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేముల శ్రీకాంత్, బత్తుల నాగరాజు, తమ్మిశెట్టి విజయకాంత్, పున్నమ్మ, మసీదు రాము , బత్తుల కృష్ణ, తమ్మిశెట్టి మోహన్, బండారు శ్రీనివాస్, వేముల నాగఫణింద్ర, నగేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.