Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈ నెల 17 వ తేది నుండి 31 వ తేది వరకు జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన సెట్ 1 ప్రశ్న పత్రాలు సోమవారం రోజు నందలూరు పోలీసు స్టేషన్ కు చేరడంతో సంబంధిత అధికారులు వాటిని సరిచూసుకుని భద్రపరచినట్లు రూట్ ఆఫీసర్లు రఘునాథ రాజు ఆనంతకృష్ణ కష్టోడియన్లు షేక్ రౌఫ్ బాష దండు సుబ్బారెడ్డి తెలిపారు.మంగళవారం సెట్ 2 ప్రశ్న పత్రాలు వస్తాయని కావున నందలూరు మండలంలోని 5 పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్. డిపార్టుమెంటు అధికారులు పోలీసు స్టేషన్ దగ్గరకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్లు ఎం.శివరామ్ ప్రసాద్ సుచరిత.మాధవీలత కె.బబిత,డిపార్ట్ మెంటు అధికారులువెంకటయ్య .హరినాథ్.స్వర్ణలత శివ ప్రసాద్ గౌడ్ నాన్ టీచింగ్ సిబ్బంది నాగార్జున ముస్తకీ బాష జాకీర్ హుస్సేన్,స్టేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.