Listen to this article

తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదర మెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ జనం న్యూస్ మార్చి 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఎత్తిపోతల పథకంలో వారాబంధి పేరుతో నీటిపారుదల అధికారులు బలవంతంగా లస్కర్లతో మోటార్లు బంద్ చేయడం సరైనది కాదని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరెంటు సక్రమంగా రాక, తరచూ మోటార్ల రిపేరు కారణంగా చివరి ఆయకట్టు రైతాంగానికి నీరు అందక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మోటార్లను బంద్ చేయించడం సరైంది కాదని వెంటనే ఎన్ఎస్ పి అధికారులు, ప్రభుత్వం జోక్యం చేసుకొని లిఫ్టులు నడిచే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. లిఫ్టులు బంద్ చేయడం మూలంగా పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్టులను పాత పద్ధతిలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలోని కొక్కిరేణి లిఫ్టును బంద్ చేశారని వెంటనే లిఫ్టులను పునరుద్ధరించి ఈ ప్రాంత రైతాంగాన్ని కాపాడాలని కోరారు.