

యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి నిరుద్యోగ భృతి 3 వేల రూపాయలు నిరుద్యోగ యువతకు ఇవ్వాలి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకి క్రీడా మైదానాలు, గ్రంథలయాలు, కోచింగ్ సెంటర్లకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
జనం న్యూస్ మార్చ్ 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12 తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది, 2025 – 26 వార్షిక బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని, నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి కి డివైఎఫ్ఐ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 12వ తేదీన అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టబోయే 2025 – 26 వార్షిక బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని, యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని నిరుద్యోగ భృతి యువతకు 3000 రూపాయలు అమలు చేయాలని సంవత్సర జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని అదేవిధంగా క్రీడ మైదానాలు, గ్రంథాలయాల అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, జిల్లా స్పోర్ట్స్ అధికారిని నియమించాలని మరియు జిల్లాలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని యువజన రంగంలో అధిక నిధులను కేటాయించే విధంగా అసెంబ్లీలో అసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుర్యాలైన కోవలక్ష్మి కి వినతి పత్రం అందించి అసెంబ్లీలో చర్చించాలని జిల్లా యువత కోసం అసెంబ్లీలో పోరాడి నిధులు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గెడం టికానంద్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు చాపిడి శ్రావణి తదితరులు పాల్గొన్నారు