Listen to this article

కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ ఐపీఎస్ జనం న్యూస్ మార్చి 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు 30 కిలోల గంజాయి సీజ్ చేసిన మునగాల పోలీసులు సోమవారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పి కె. నరసింహ ఐపిఎస్, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 35 సంవత్సరముల వయస్సు గల సను ఖిలా @ శ్రీను అనే వ్యక్తి వాళ్ళ ఏరియాలో పుల్లికొండ గ్రామానికి చెందిన పూర్ణ దగ్గర గంజాయిని తక్కువ రేటుకు గంజాయి కొనుగోలు చేసి, కావాల్సిన వారికి కిలో ఒక్కంటికి ఎక్కువ రేటుకు అమ్ముతూ వ్యాపారం చేసేవాడు. ఈ మధ్య కాలములో మా ఏరియాలో గంజాయిని కిలో ఒక్కంటికి 1500 రూపాయల చొప్పున కొని, దూల్ పేట ఏరియా, హైద్రాబాదు లో అమ్ముకుంటే కిలో ఒక్కంటికి 10,000/- చొప్పున వస్తాయని తెలిసి, హైద్రాబాదు కు గంజాయిని తీసుకవెళ్ళి హైద్రాబాద్ లో అమ్ముకోవాలని నిశ్చయించుకుని, తేదీ 09.03.2025 రోజున పుల్లికొండ గ్రామానికి చెందిన పూర్ణ, అను వ్యక్తి దగ్గర 30 కిలోల గంజాయిని కిలో ఒక్కంటికి 1500/- రూపాయల చొప్పున కొనగా, పూర్ణ మొత్తం 15 ప్యాకెట్లు గా ప్యాక్ చేసి ఇవ్వగా, సదరు సను ఖిల @ శ్రీను వాటిని ఒక సూపర్ బస్తాలో పెట్టుకొని, ఒక లారీ ఎక్కి హైద్రాబాదు పోవడానికి ఇక్కడి వరకు వచ్చి, లారీ డ్రైవరు సైడ్ కు వెళ్తానంటే, సోమవారం అనగా తేదీ 10.03.2025 ఉదయం అందాజ 8.30 గంటల సమయములో, సదరు సను ఖిల @ శ్రీను గంజాయి బస్తా తో యుక్తముగా లారీ దిగి, గంజాయి గల సూపర్ బస్తా ను చెట్లలో పెట్టి, హైద్రాబాదు పోవడానికి రోడ్డు ప్రక్కన నిలబడి వాహనాలు ఆపుతుండగా బ్లూ కొల్ట్ పోలీస్ వారు సదరు వ్యక్తిని అనుమానించి అందాజ ఉదయం 9 గంటల సమయమున పట్టుకున్నారు. ఇట్టి కేసులో పుల్లికొండ గ్రామానికి చెందిన పూర్ణ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. సను ఖిలా @ శ్రీను పై గతములో ఎలాంటి కేసులు లేవు.గంజాయి విలువ 3,00,000/- మరియు సెల్ ఫోన్ విలువ 5,000/- మొత్తం విలువ 3,05,000/- రూపాయలు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. సదరు నేరస్థున్ని పట్టుబడి చేసిన దాంట్లో మునగాల ఎస్సై బి. ప్రవీణ్ కుమార్ , హెడ్ కాన్స్టేబుల్ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కానిస్టేబుల్స్ శివ కోటేశ్వర్ రావు, ఎల్లారెడ్డి సతీష్ మరియు రాంబాబు, పర్యవేక్షణ చేసిన సిఐ రామకృష్ణారెడ్డిని పోలీస్ అధికారులను అభినందించినారు.