Listen to this article

జనం న్యూస్ మార్చి 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు ఆర్టీసీ బస్ డిపో కి చెందిన డ్రైవర్ జె రాంబాబు కోదాడ నుండి వయా మాచర్ల నుంచి హైదరాబాదు సర్వీస్ చేస్తుండగా మాచర్లలో సిహెచ్ నరసింహారావు అనే ప్రయాణికుడు ఎక్కి హైదరాబాదులో దిగినాడు.దిగే క్రమంలో తన బ్యాగుని మర్చిపోయి వెళ్ళిపోయాడు బ్యాగును గమనించిన ఆర్టీసీ డ్రైవర్ రాంబాబు హైదరాబాద్ మహాత్మ గాంధీ బస్ స్టేషన్ లో ఆర్టీసీ ఎస్ఎం సెక్యూరిటీ సిబ్బందికి అందించగా వారు బ్యాగు తెరిచి చూడగా లాప్ టాప్,లక్ష రూపాయల నగదు గమనించారు.బ్యాగ్ లో వేరే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ద్వారా సంబంధిత వ్యక్తి కాంటాక్ట్ నెంబరు సేకరించి ఫోన్ చేసి తనకి తన డబ్బులను వస్తువులను అప్పగించడం జరిగింది.బాధ్యతతో బ్యాగు తీసుకొచ్చి అప్పజెప్పిన కోదాడ ఆర్టీసీ డ్రైవర్ రాంబాబును ఆర్టీసీ కోదాడ డిపో మేనేజర్ డి శ్రీహర్ష రు,సిబ్బంది,పలువురు ప్రయాణికులు అభినందించారు.