Listen to this article

జనం న్యూస్ మార్చ్ 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. సావిత్రి బాయి ఫూలే సేవలు భారతీయ సమాజం మరువలేనివి మాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్నులే,బారతీయ బౌద్ద మహా సభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్ లు అన్నారు.
నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసి,కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేసిన ధీర వనిత అని అన్నారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. మరణించే వరకు సేవ
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు, పేదల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులాలకి చెందిన దళిత చిన్నపిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి 10, 1897 లో మరణించింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించాడు. సావిత్రి బాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా బిళ్ళను విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు.కార్యక్రమంలో మాలి సంఘం జిల్లా అధ్యక్షులు మెంగాజి, ఎస్ఎస్ డి జిల్లా ఇన్చార్జి దుర్గం సందీప్,వాంకిడి ఎస్ ఐ ప్రశాంత్ ,బౌద్ద మహా సభ జిల్లా ఉపాధ్యక్షులు వినేష్,మండల బౌద్ద మహా సభ అధ్యక్షులు జయరాం,సమాజ అధ్యక్షులు విలాస్, రాజేంద్ర ప్రసాద్,మండల మాలి సంఘం అధ్యక్షుడు బాబు రావు,మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,నాయకులు,విజయ్ ఉప్రే, రోషన్, అరుణ్, శివాజీ, ప్రతాప్ ఇంద్రజిత్, రమేష్, రాజేశ్వర్ దుర్గం మనోజ్, జాడే రమేష్, దుర్గం చింటూ, బల్వంత్,భీమ్ రావు,నాగ్ సేన్, దివాజీ,తదితరులు పాల్గొన్నారు.