

రెండోసారి నియామకంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం.
శంకరపట్నం జనవరి 12
జనం న్యూస్ శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామపంచాయతీ అనుసంధానమైనా పాపయ్యపల్లి గ్రామానికి చెందిన ఏనుగుల అనిల్ ను శంకరపట్నం బిజెపి మండల అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లా బిజెపి ఎన్నికల అధికారి సంకినేని వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఏనుగుల అనిల్ శనివారం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించి కరీంనగర్ ఎంపీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి బహుమతిగా అందిస్తామన్నారు.శంకరపట్నం మండల అధ్యక్షుడిగా మరోసారి సేవ చేయడానికి, తన నియమకానికి కృషి చేసిన రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ, మండల,వివిధ గ్రామాల నాయకులకు,తన అభిమాన సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.