Listen to this article

జనం న్యూస్ మార్చ్ 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పి ప్రభాకర్ రావు పర్యవేక్షణలో రెబ్బెనలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నందు షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు . ఈ సందర్భంగా ఆసిఫాబాద్ షీ టీం ఇన్చార్జి ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.
మహిళలపై హింస , ఈవ్టీజింగ్ , సైబర్ క్రైమ్ లకు ఎవరైనా గురి అయినట్లయితే వెంటనే షీటీం ను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల అయినా ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో జాగ్రత్త వహించాలని అన్నారు. మహిళా ఎస్సై శిరీష మాట్లాడుతూ.. వ్యక్తిగత భద్రతకు సంబంధించిన గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలోని మహిళలకు రక్షణ కల్పించడం కోసమే షీ టీంలు పనిచేస్తున్నాయని, అలాగే ఏదైనా అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేయాలని పేర్కొన్నారు. షీ టీం ఆసిఫాబాద్ ఫోన్ నంబర్ 8712670564 కు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ షీ టీం ఇన్చార్జ్ వెంకటేశ్వర్లు, మహిళా ఎస్సై శిరీష, మరియు పాఠశాల సిబ్బంది , షీ టీం సభ్యులు స్వప్న పాల్గొన్నారు.