Listen to this article

జనం న్యూస్ 11 మార్చి 2025. జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా తక్షణమే రైతులకు బోనస్ అకౌంట్లో వేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలిపిన రైతులు.రైతులకు మద్దతు తెలిపిన BRS పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య నిరసన తెలిపిన అనంతరం రైతులతో కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రంను అందించి తక్షణమే రైతులకు బోనస్ ను ఇవ్వాలని తెలిపారు.ఈ సందర్బంగా BRS పార్టీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ. జిల్లాకు కేటాయించిన 33,86,09800 కోట్ల బోనస్ బడ్జెట్ లో సంగం మంది రైతులకు కేవలం 18,25,87600 కోట్లు మాత్రమే అకౌంట్లో వేశారు ఇంకా సగం మంది రైతులకు 15,60,22200 కోట్ల బోనస్ బడ్జెట్ను ఎప్పుడు వేస్తారు అని డిమాండ్ చేశారు. మాకు రావాల్సినటువంటి వడ్ల బోనస్ ఎప్పుడు ఇస్తావు అని ఈరోజు రైతులు కలెక్టర్ కార్యాలయం ముందర నిరసన తెలిపి నిలదీయడం జరిగిందని అన్నారు.రేవంత్ రెడ్డి సర్కార్ ఆనాడు అసత్య ప్రచారంతో గద్దెనెక్కి కొనుగోలు చేసిన వడ్లకు తక్షణమే మొత్తం బోనస్ వెస్తామని మాయమాటలు చెప్పి ఈరోజు రైతులను నట్టేట ముంచడం దుర్మార్గం అని అన్నారు. రైతులను అరిగోషాలు పెట్టిస్తూ రైతు కళ్ళలో నుంచి కన్నీళ్లు పెట్టిస్తున్న సర్కార్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి.ఇంతవరకు రైతులకు సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేయలేదు, ఇంకా జిల్లాలో రైతు భరోసా 83,030 మంది రైతులకు ఇవ్వలేదు.పేరుకే ఇందిరమ్మ రాజ్యం కానీ ఇది రాబందుల రాజ్యం రేవంత్ రెడ్డి కేవలం పదవిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఢిల్లీకి మూటలు మోస్తూ ఇప్పటికే 40 సార్లు ప్రజాపాలన గాలికి వదిలేసి ఢిల్లీకి తిరగడం సిగ్గుచేటు. రాష్ట్రంలో రైతులను ఆగం చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీ పైన గల పడతాం
బాకీ పడ్డ రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ ఇచ్చేవరకు వదిలిపెట్టం ఎకరానికి 15000 ఇస్తానని నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కి నేడు ఎకరాకి 12,000 ఇస్తానని మోసం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి.ఇప్పటికే రాష్ట్రంలో 400 పైగా రైతులు ఆత్మహత్యలు. ఈ ఆత్మహత్యలు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే.
కేసీఆర్ పాలనలో రైతుల కళ్ళలో ఆనందం…కాంగ్రెస్ పాలల్లో రైతుల కళ్ళలో కన్నీళ్లు.నాడు నాట్లప్పుడు, నేడు ఓట్లప్పుడు రైతుబంధు. రైతులకు రుణమాఫీ చేయకుండగా, రైతు భరోసా ఇవ్వకుండా, ఆడబిడ్డలకు నెలకు 2500 చొప్పున ఖాతాలో వేయకుండా, 4వేల పింఛను వేయకుండా స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గల పట్టుకొని అడుగుతాం అని అన్నారు ఆరు గ్యారెంటీలు ఏడికి పోయినవి అని నిలదీసే పరిస్థితి కచ్చితంగా వస్తుందని అన్నారు.తెలంగాణలో ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీని కూడా అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అక్కడ గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత తనదని చెప్పడం ఈ ఏడాది పెద్ద జోక్ అని అన్నారు. కెసిఆర్ పాలనలో నాట్లు వేసేటప్పుడు రైతుబంధు పైసలు పడితే..కాంగ్రెస్ పాలనలో ఓట్లప్పుడు మాత్రమే వేయడం రైతులను మోసగించడమే. అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ, ఎకరాకు 15 వేల రైతు భరోసా ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నిస్సిగ్గుగా మాట మార్చడం రేవంత్ రెడ్డి వక్రబుద్ధి బయటపడింది అని అన్నారు.భవిష్యత్తులో నువ్వు ఇచ్చిన హామీ రుణమాఫీ రైతు భరోసా, బోనస్ కచ్చితంగా వేసే విధంగా మెడలు పంచుతాం లేని పక్షంలో నిన్ను స్థానిక ఎలక్షన్లలో తిరగనియ్యకుండగా గల్ల పట్టి అడుగుతామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో ఐజ మండలోని బైనపల్లె రాజపురం పులికల్లు చిన్నతండ్రపాడు రైతులు నూర్ పాషా, కురువ బందే నవాజ్, మహబూబ్ఆలీ, అల్లం పాషా, చంద్రశేఖర్ రెడ్డి, ఉరుకుందు, మౌలాలి, ఆంజనేయులు, జాకీర్, మైబు, మల్లేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.