

శంకరపట్నం జనవరి 12
జనం న్యూస్
శంకరపట్నం మండల కేంద్రంలో శనివారం సీనియర్ జర్నలిస్ట్ కొరిమి వెంకటస్వామి ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ చట్టసభల్లో జర్నలిస్టుల దాడులపై ప్రత్యేక తేవాలన్నారు. బస్తర్ చెందిన ముకేష్ అదే ప్రాంతంలో గంగలూరు నుండి హీరోలి వరకు రూ. 120 కోట్లతో చేపట్టిన రోడ్డు ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కథనం వెలువరించాడు. మొదటగా రూపాయలు 50 కోట్ల టెండర్ తో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి అభివృద్ధి జరగకపోయినప్పటికీ రూ.120 కోట్లకు చేరుకుందని వెల్లడించారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ ఇంటి ఆవరణలో శవమై కనిపించాడన్నారు. హంతకులు అతడిని దారుణంగా కొట్టి గుండెను చీల్చి బయటకు తీసినట్లు వైద్యులు తెలిపినట్లు గుర్తు చేశారు. నిక్కర్సైన జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు అండగా ఉండాలని పలుమార్లు తెలిపిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.ఇంత క్రూరంగా హింసించి చంపిన హంతకులకు కఠినంగా శిక్షించి పత్రికల స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.లేనియెడల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జర్నలిస్టులతో కలిసి పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు బూర్ల వెంకటేష్,చింతం వెంకటేష్,బుర్ర సత్యనారాయణ,కత్తెరమళ్ళ కిరణ్,దామెర సతీష్,ఎలుకపల్లి సుధీర్,దేవునూరి రాకేష్, గొర్ల అనిల్, వడ్ల రాజు,తాళ్ల సురేష్,పెద్ది గట్టయ్య,బొంగోని అభిలాష్ లు పాల్గొన్నారు.