

జనం న్యూస్ మార్చ్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల 12వ తేదీన బుధవారంఅనకాపల్లి జిల్లా రింగ్ రోడ్డు వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అనకాపల్లి జిల్లా వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ బుధవారం వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అనకాపల్లి నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీ యువత పోరు* పోస్టరు ఆవిష్కరించారు. ఫీజు రియింబర్స్ మెంట్, నిరుద్యోగ భృతి అమలు పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ నెల 12 వ తేదీన యువత పోరు పేరిట కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కి వినతిపత్రం అంద చేయనున్నట్లు అనకాపల్లి నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ చెప్పారు.. ఈ పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.