

జనం న్యూస్ 12 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా – వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన…- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ..మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్…యూత్ కాంగ్రెస్ గద్వాల్ జిల్లా అధ్యక్షులు ఆర్ తిరుమలేష్*
యూత్ కాంగ్రెస్ గద్వాల్ జిల్లా జనరల్ సెక్రటరీ కె.యం.ఆర్.యేసు..
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.తిరుమలేష్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలో పాల్గొని..ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ..మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్…హాజరై రాజీవ్ మార్గ్ లోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. దేశ ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.. యువతరం మేల్కోండి అంటూ యువతకు సరితమ్మ పిలుపునిచ్చారు. యువతకు స్ఫూర్తి ప్రధాత, తన అపార మేధస్సుతో దేశ ఖ్యాతిని విశ్వావ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి వివేకానంద స్వామి అడుగుజాడల్లో నడచి రేపటి యువతకు మార్గదర్శకంగా నిలవాలని సరితమ్మ సూచించారు..ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ గద్వాల్ మండల్ అధ్యక్షులు కోళ్ల నర్సింహులు, ఇటిక్యాల మండల్ ప్రెసిడెంట్ సంకటి రాజేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు మరియు ఆయా మండల సీనియర్ నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…