

జనం న్యూస్ మార్చి 11(నడిగూడెం) మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీ వందరోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి అన్నారు. మంగళవారం నడిగూడెంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న వర్క్ సైట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీల హాజరును క్షేత్రస్థాయిలో పరిశీలించి, స్వయంగా హాజరు తీసుకున్నారు. వారి వెంట ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ ఉన్నారు.