

జనం న్యూస్ 12 జనవరి ( వికారాబాద్ జిల్లా ప్రతినిధి కావలి నర్సిములు )
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ ఓబీసీ మాస్టర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేష్ పటేల్, పూడూర్ మండల అధ్యక్షులు తుంపల్లి రాఘవేంద్ర,వికారాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీశైలం, మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటన్న, వివేకానంద యూత్ అధ్యక్షులు ముడిమ్యాల జంగయ్య, పూడూరు మండల బీజేవైఎం అధ్యక్షులు చాకలి పాండు, మండల ఉపాధ్యక్షులు కృష్ణ చారి, పరిగి మార్కెట్ కమిటీ మెంబర్ కొందపల్లి రమేష్, బీజేపీ సీనియర్ నాయకులు సాకలి బుచ్చన్న, అనంతరాములు, గౌరేశం, శ్రీనివాస్, కిరణ్, విట్టల్, గోంగూపల్లి బూత్ అధ్యక్షులు మహేష్, తదితర గ్రామ ప్రజలు నాయకులు పాల్గొనడం జరిగింది.