Listen to this article

జనం న్యూస్ మార్చి 11(నడిగూడెం) వచ్చే ఖరీఫ్ సీజన్ నుండి తెలంగాణా రాష్ట్రం లో ప్రకృతి వ్యవసాయం పై ప్రత్యేక ప్రాజెక్ట్ అమలు చేయాలని నడిగూడెం కు చెందిన వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య మంగళవారం తెలంగాణా రాష్ట్ర అగ్రికల్చర్,ఫార్మర్స్ వెల్ఫేర్ కమీషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి కి లేఖ రాశారు. రోజు రోజు కు వ్యవసాయం లో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరుగుతుండడంతో నేల సారం దెబ్బ తింటున్నదని, దీంతో రైతులకు పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయని, దీనిని తట్టుకోలేక రైతులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని, ముఖ్యంగా జబ్బుల పాలవుతున్నారు. గత 60 ఏళ్లుగా మనం విషంతో కూడిన ఆహారం తింటుండంతో వయస్సుతో తేడా లేకుండా క్యాన్సర్ బారిన పడుతున్నామని మనతో పాటు మన భవిష్యత్ తరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రైతు కు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పించి ప్రకృతి వ్యవసాయం చేయించాలని, నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం అని పంట ఆరోగ్యమే మన ఆరోగ్యమని, ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు చెప్పే వారు లేరని, ప్రత్యేక సిబ్బందిని నియమించి గ్రామ స్థాయి నుండి అవగాహన కల్పించాలని, సంవత్సరానికి కేవలం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొదటి విడతగా 50 వేల మంది రైతులకు శిక్షణ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాలని లేఖలో పేర్కొన్నారు.