

జనం న్యూస్ 12 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పేదలకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. పట్టణంలోని నెయ్యిల వీధి, అగురు వీధిలో ఉన్న పేదల వద్ద నుంచి ఇళ్ల స్థలాలకు మంగళవారం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ… సొంతిళ్లు లేక నిరుపేదలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.