

బి.జె.పి.ఇంచార్జి నీరుకొండ వీరన్న చౌదరి
జనం న్యూస్: మార్చి 12 తూర్పు ఉదయం విలేకరి (గ్రంధి నానాజీ) భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం హర్షనీయమని ఆ పార్టీ రాజనగరం నియోజకవర్గం ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన సీనియర్ నాయకులను సముచితమైన స్థానాల్లో ఎంపిక చేసి గౌరవించడం పార్టీలో ఆనవాయితీగా వస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడి, అంకితభావంతో పనిచేసిన వారందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందనడానికి ఇదే నిదర్శనమని వీరన్నచౌదరి అన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి సారధ్యంలో కూటమి పాలనలో డబల్లింజన్ సర్కార్ విజయవంతంగా కొనసాగుతుందన్నారు. రికార్డ్ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని రానున్న రోజుల్లో అద్భుతమైన మార్పు దేశంలోనూ రాష్ట్రంలోనూ చూడబోతున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పొత్తు ధర్మాన్ని పాటించి ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని వీరన్న చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు.