Listen to this article

బిచ్కుంద మార్చ్ 12 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) మద్నూర్ మండలం ఎంబురా రాచన్న దేవాలయం నుండి కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయానికి జుక్కల్ నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పాదయాత్రగా వెళ్లడం జరిగింది.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ఈరోజు వారితో కలిసి కొద్ది దూరం పాదయాత్రలో పాల్గొని సోమేశ్వర ఆలయాన్ని మరియు రేణుకా చారిలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు..