

జనం న్యూస్ మార్చి 12 నడిగూడెం మండలం పరిధిలోని సిరిపురం గ్రామం లోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల కు అదే గ్రామానికి చెందిన చివలూరి శ్రీనివాసాచార్యులు జ్ఞాపకార్థంగా వారి కూతురు,అల్లుడు వేదాంతం చక్రధరాచార్యులు,ఉదయశ్రీ దంపతులు బుధవారం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. అలాగే ప్రతీ సంవత్సరం క్లాసులో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన పదవ తరగతి విద్యార్థులకు రూ.3116, రూ.2116, రూ.1116,నగదు బహుమతిగా అందిస్తానని చివలూరి రామకృష్ణ ప్రకటించారు.