

జనం న్యూస్ 12 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని నడిగడ్డ ఇలవేల్పు అయిన శ్రీ శ్రీ శ్రీ జములమ్మ అమ్మవారి పరుశరాముడు దేవస్థానం నూతన చైర్మన్ డైరెక్టర్స్ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.ఎమ్మెల్యే దంపతులకు ఈవో, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు,,ఎమ్మెల్యే గజమాల తో సత్కరించి ఆలయ కమిటీ నూతన చైర్మన్ డైరెక్టర్స్ ఘనంగా స్వాగతం పలికారు …శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మవారు పరుశురాముడు దేవస్థానం నందు ఎమ్మెల్యే దంపతులు నూతన పాలకమండలి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను పొందడం జరిగింది
దేవాలయం ప్రాంగణంలో ఎమ్మెల్యే గారికి సమక్షంలో దేవాదాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో నూతనంగా నియామకంమైన చైర్మన్ & డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం చేశారు.నూతనంగా జములమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ బోయ వెంకట్ రాములు , మరియు డైరెక్టర్స్ కు ఎమ్మెల్యే దంపతులు గార్లు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు .ఎమ్మెల్యే దంపతులకు నూతన కమిటీ చైర్మన్, డైరెక్టర్స్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి గజమాల తో జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు ….
మాజీ ఆలయం చైర్మన్ మాట్లాడుతూ….గతంలో ఎన్నడు ఎప్పుడు లేని విధంగా మా నాయకుడు ఎమ్మెల్యే గా గెలుపొందిన తర్వాత నేను చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మా నాయకుడు ఎమ్మెల్యే సహాయ సహకారాలతో జములమ్మ ఆలయ అభివృద్ధిలో కృషి చేయడం జరిగింది. జములమ్మ దేవాలయ ప్రాంగణంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన రహదారిలో రోడ్డు నిర్మాణం సెంట్రల్ లైట్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు పరశురాముడు దేవాలయంలో వెళ్లే ప్రాంతంలో షెడ్డు నిర్మాణము కూడా చేయడం జరిగిందని తెలిపారు.
వివిధ ప్రాంతాల నుండి విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యం కోసం నూతనంగా రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్లో ఏ విధంగా అయితే బల్కంపేట అమ్మవారు దేవాలయంలో కళ్యాణం చేస్తారు. గద్వాల నడిగడ్డ ఇలవేల్పు అయిన అమ్మవారి దేవాలయంలో కూడా శ్రావణమాసం నాలుగవ శుక్రవారం నాడు అమ్మవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కోసం అన్నదాన కార్యక్రమంలో కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే సహకారంతో జమ్ములమ్మ అభివృద్ధి చేయడం సాధ్యం కావడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా నూతన కార్యవర్గం మరింత అభివృద్ధి చేసే విధంగా ఎమ్మెల్యే సహకారంతో నా వంతు సూచనలు సలహాలు ఎప్పుడు అందిస్తూ ఎల్లప్పుడూ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ…..నడిగడ్డ ఇలవేల్పు అయిన శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మవారి ఆశీస్సులతో గద్వాల నియోజకవర్గం దినదిన అభివృద్ధి చెందుతుంది. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరి ఆశీస్సులతో నాకు మరొక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.నడిగడ్డ ఇలవేల్పుగా అయిన జములమ్మ అమ్మవారి దర్శనానికి కర్ణాటక మహారాష్ట్ర, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా భక్తులు రోజురోజుకు పెరగడం జరుగుతుంది కాబట్టి భక్తులకు అసౌకర్యం కలిగించకుండా ఉండాలని ఉద్దేశంతో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నా వంతు కృషి చేస్తూ పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దేవాలయం లో అమ్మవారి కి బంగారు క్రీటము అలంకరించినానికి ఆభరణాలను భక్తుల సహకారంతో అదేవిధంగా దాతల సహకారంతో తయారు చేయించి భక్తులు ఇచ్చిన బంగారంలను అమ్మవారి కిరీటంలో అలంకరణ ఆభరణాలను ఈ నూతన కార్యవర్గ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తెలిపారు.దేవాలయం సమీపంలో 2 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం ఏర్పాటు చేసి బీదా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి వారు వివాహ శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. జములమ్మ దేవాలయ అభివృద్ధి కొరకు త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుంది,80 లక్షల తో కళ్యాణ మండపం మరియు డైనింగ్ హాల్ను నిర్మాణం చేసి ప్లాన్స్, ఎస్టిమేట్ పూర్తి చేయడం జరుగుతుంది తెలిపారు.
దేవాలయ గేటు దగ్గర ఐదు షాపులు నిర్మాణం చేయడం జరిగింది వాటి ద్వారా వచ్చిన డబ్బులను దేవాలయం అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. 60 లక్షలతో మరొక 10 షాపులను నిర్మాణం చేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులను దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.
భవిష్యత్తులో జములమ్మ దేవాలయంలో మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ఒక పుణ్యక్షేత్రం వలె తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నా వంతు కృషి చేస్తానని అని తెలిపారు,,నూతన చైర్మన్ మాట్లాడుతూ…
శ్రీ జములమ్మ ఆలయ కమిటీ చైర్మెన్ గా అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గ జిల్లా మంత్రివర్యులకు ఇన్చార్జి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి గారికి, ఎంపీ , గద్వాల ఎమ్మెల్యే ప్రత్యేకమైన ధన్యవాదాలు….. నాపై నమ్మకం ఉంచి నాకు జమ్ములమ్మ ఆలయ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఎల్లప్పుడు రుణపడి ఉంటాను జములమ్మ ఆలయ అభివృద్ధిలో నా వంతు కృషిచేసి దేవాలయ అభివృద్ధి కొరకు తోడ్పాటు అని తెలిపారు.ఎమ్మెల్యే సహకారంతో త్వరలో జరగబోయే జాతర బ్రహ్మోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి దేవాలయ వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో లాంటి ఇబ్బంది లేకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ దేవాలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు,ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, వినియోగదారుల ఫోరం రాష్ట్ర మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా రైతు సమితి మాజీ ఛైర్మన్ చెన్నయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, రమేష్ నాయుడు, మాజీ ఆలయం చైర్మన్ సతీష్, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్, కౌన్సిలర్స్, మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, శ్రీను, నాగలత రామకృష్ణ శెట్టి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.