

జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు ముక్కెర ముఖేష్ మాదిగ డిమాండ్ చేశారు శాయంపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షకు ఎంఎస్పి మండల అధ్యక్షుడు మామిడి భాస్కర్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా నియామకాలు చేపట్టడం అంటే మాదిగలను మోసం చేయడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల జిల్లా అధికార ప్రతినిధి కొయ్యడ విష్ణు ఎంఆర్పిఎస్ మండల ఉపాధ్యక్షులు కుమారి రాజన్న మామిడి చంద్రమౌళి ఘజియా మామిడి తిరుపతి పోతుగంటి సాంబరాజు పసుల ప్రవీణ్ శరత్ కాసాని ఆశిష్ వంశీ నాగరాజు ప్రశాంత్ మనోహర్ కిట్టు రాజు వంశీ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు