

జనం న్యూస్ మార్చి 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలాజీ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ రాజపుత్ జన్మదిన వేడుకలు బుధవారం కూకట్పల్లిలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపు లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో టిపిసిసి మీడియా కోఆర్డినేటర్ సత్యం శ్రీరంగం ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి బీ బ్లాక్ అధ్యక్షులు తూము వేణు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి సంజీవ మైకల్ నాగరాజు ప్రకాష్ మొయిజుద్దీన్ నరసింహ అరుణ్ బాలరాజు సుధా రమాదేవి జోజమ్మ భరతమ్మ తదితరులు పాల్గొన్నారు