

ముఖ్యమంత్రితో హామీని ఇప్పించిన మండలాన్ని ఏర్పాటు చేయలేని అసమర్ధ మాజీ ఎమ్మెల్యే, పది సంవత్సరాలు అధికారంలో ఉన్న మండలం ఏర్పాటు చేయలేని మీరు, మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది… అధికార బలంతో అర్ధరాత్రి దీక్ష శిబిరాన్ని భగ్నపరిచిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే… ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న దీక్షాపరులను సంఘీభావం తెలపని అసమర్ధుడు మహా రెడ్డి భూపాల్ రెడ్డి…ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం… జనం న్యూస్, మార్చ్ 12,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో బుధవారం పాత్రికేయుల సమావేశాన్ని తడ్కల్ మండల కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడ్కల్ ను మండల కేంద్రంగా అల్లాదుర్గం బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు,సభాముఖంగా నిజాంపేట్,తడ్కల్ ను మండల కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడం పెద్ద పని కాదు అన్న ముఖ్యమంత్రి,పది సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో తడ్కల్ ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయలేని అసమర్థులు నిన్నటి రోజున మండల ప్రస్తావన లేవనెత్తడం సిగ్గుచేటని మండిపడ్డారు.మీ పాలన కొనసాగుతున్న తరుణంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న దీక్షాపరులకు కించపరిచిన స్థానిక నాయకులు,వారి ప్రాణాలతో చెలగాటమాడడానికి వెనకడుగు వేయని జెడ్పిటిసి,మండల ఏర్పాటుపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.గతంలో మండలాన్ని ఏర్పాటు చేయలేని అసమర్ధులు అవగాహన లేనివారు, చేతకాని వారు, మీరేనని మర్చిపోయి. అధికారంలో ఉన్న ప్రభుత్వంపై బురద చల్లడమే అని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు,అభివృద్ధి చేసిన ఘనత,కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అధికారంలో ఉన్న మీరు మండలం ఏర్పాటుకై తీర్మాణలను ఇవ్వకూడదని గ్రామస్థాయి నాయకులకు ఉసిగొల్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం మహా రెడ్డి భూపాల్ రెడ్డి, మాత్రమేనని ప్రజలు ఛీ కొడుతున్నారు.గతంలో మీరు ఏర్పాటు చేయలేని మండల కేంద్రాన్ని,అత్ త్వరితగతిన మండల ఏర్పాటుపై మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే ఎంపీ రాత్రిన్ పగళ్ళు లెక్క చేయకుండా మండలం ఏర్పాటుకు కృషి చేయడంతోనే మొన్నటికి మొన్న అభ్యంతరాలు తెలిపిన గ్రామాలను జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం ఆయా గ్రామాలలో గ్రామ ప్రజల అభ్యంతర వాంగ్మూలాన్ని సేకరించిన నివేదికను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ జైపాల్ రెడ్డి, నాయకులు పెద్ద మల్లారెడ్డి,డాక్టర్ హమీద్,ముల్తాని బాబు సాబ్,వల్మూరే జ్ఞానేశ్వర్ రావు,కోటగిరి మనోహర్,సుదర్శన్ రావు,ఆకుల రాములు, కర్ణం శ్రీనివాస్,కృష్ణారెడ్డి, మారుతీ రావు,రుస్తుం సమీర్,