

జనం న్యూస్ మార్చి 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నేటి బాల బాలికలే రేపటి పౌరులు ప్రతి విద్యార్థి కి చిన్నతనం నుండే సొంతంగా ఆలోచించి అదే ఆలోచని ముందుకు వెళ్లే విధంగా తీర్చిదిద్దాలని పాఠశాల యాజమాన్యం పేర్కొన్నారు.. స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ అనే నూతన వరవడికి శ్రీకారం చుడుతూ తమ పాఠశాల విద్యార్థులకు ఏ ఏ రంగాలలో వారికి ఆసక్తి ఉంది అనే విషయాన్ని కనుగొని అదే రంగానికి సంబంధించి విద్యార్థులను ముందుకు ప్రోత్సహించే విధంగా పాఠశాల యాజమాన్యం సదస్సు నిర్వహించి అందులో విద్యార్థుల తల్లిదండ్రులను సైతం భాగస్వాములను చేయడంతో పిల్లలు ఇలా చదువుతున్నారు అని తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు ఈ ప్రోగ్రాం వల్ల ఎంతో తెలుస్తుంది అనడంలో సందేహమేమీ లేదు ఇలాంటి ప్రోగ్రాంలో నారాయణ స్కూల్ ఇంకా ఎన్నో జరపాలని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు తల్లిదండ్రులకు సైతం ఈ విధంగా ఏర్పాటు చేయడంలో తల్లిదండ్రులు మరియు పిల్లలు ఎంత సంతోషించారు ముఖ్య అతిథిగా పాల్గొనిన వారు కెపిహెచ్బి జోన్ ఏజీఎం విజయంతి ఈ కిడ్స్ ఆర్ అండ్ డి అబేధా కోఆర్డినేషన్ సోనియా ప్రిన్సిపల్ వసుప్రద వైస్ ప్రిన్సిపల్ సుజాత తదితర స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు