

జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రాజకీయ లబ్ధి కోసమే రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ధర్నా పేరుతో దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాడని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని చలివాగులో పరివాహక ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే ధర్నా నిర్వహించిన నేపథ్యంలో మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి బుచ్చిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారి పంటలకు కాంగ్రెస్ మండల నాయకులు రక్షణగా ఉంటారని భరోసా ఇచ్చారు. భూగర్భ జలాలు అడుగంటిన తరుణంలో చలివాగులో వీటి లెవెల్స్ తగ్గడం జరిగిందని, అందుకు రైతులకు ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలతో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నీటి లిఫ్టింగ్ నిలిపివేయించడం జరిగిందని గుర్తు చేశారు. చలివాగు కాలువల మరమ్మత్తులు జరుగుతున్న తరుణంలో క్రాప్ హాలిడే ప్రకటించినప్పటికీ రైతుల విజ్ఞప్తి మేరకు జాలు కలువ ద్వారా నీటిని విడుదల చేసి చిత్తశుద్ధిని చాటుకున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉండగా చలివాగు ను అడ్డుపెట్టుకొని చాపల వ్యాపారం చేశారని, కట్ట ఎత్తుగా పోయిస్తానని హామీ ఇచ్చి గెలిచాక విస్మరించారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చలివాగులో నీటి లెవెల్స్ తగ్గిపోయినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు ధర్నా చేస్తే అక్రమ కేసులు నమోదు చేయించిన హీన చరిత్ర వారిదని మండిపడ్డారు. ఉనికి కోసం రైతులను ఆందోళనకు గురి చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిందం రవి, వలి హైదర్, దుబాసి కృష్ణమూర్తి, వైద్యుల వెంకటరాజు రెడ్డి, ఆదిరెడ్డి, లడే రాజ్ కుమార్, ఐలయ్య, కట్టయ్య, మార్కండేయ, డిటి రెడ్డి, బసాని రవి, సదయ్య, జక్కుల నరేష్, రాజు, జగన్, రాజయ్య, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు….