

జనం న్యూస్ మార్చ్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా మునగపాక మండలం : మార్చ్ 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని మునగపాక జనసేన పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు టెక్కలి పరశురాం పత్రిక సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు మార్చి 14 న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మునగపాక మండలంలో ఉన్న పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమమును జయప్రదం చేయాలని కోరారు.మండల కార్యాలయం నుండి బస్సులు అలాగే 250 బైకులతో మునగపాక నుండి పిఠాపురం వరకు బైక్ లతో వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునగపాక గ్రామ శాఖ అధ్యక్షులు సూరిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు..