

జనంన్యూస్. 12. నిజామాబాదు. ప్రతినిధి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన, రూరల్ ఎమ్మెల్యే. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు – జక్రాన్పల్లి మండలంలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు పై ప్రాతినిధ్యం. బుధవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అసెంబ్లీలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి. కలిసారు. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు పై వస్తున్న వివిధ కథనాలను, వివిధ వర్గాల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో స్పందించిన సి.ఎం తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు లేదని స్పష్టమైన ఆదేశాలు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీమతి యోగితా రాణి కి జారీ చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు మంజూరైన నూతన జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్పల్లి మండలంలో ఏర్పాటు చేయాలని, విద్యాలయం ఏర్పాటుకు గల అనుకూల అంశాలను ఎమ్మెల్యే వివరించగ, ముఖ్యమంత్రి సానుకూలాంగా స్పందించారు.