


పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు జిల్లా ఎస్పీ డివీ శ్రీనివాసరావు జనం న్యూస్ మార్చ్ 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆసిఫాబాద్ పట్టణం లోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ అధికారులకు సిబ్బంది వారి యొక్క కుటుంబ సభ్యులకు కేర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరము ను జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పాల్గొని , ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ వైద్య శిబిరం నందు ఉన్నత అధికారి నుండి హోంగార్డ్స్ వరకు వివిధ రకాల వైద్య పరీక్షలు ఈసీజీ, బిపి, షుగర్ పరీక్ష, పల్స్ రేట్, 2డి ఎకో చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసుల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించమని అన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసే పోలీసులు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే విధులు సమర్థంగా నిర్వహించగలరన్నారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపులు, యోగ ,క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే గొప్ప సంపదని ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంలో ప్రతి పోలీస్ జీవితంలో ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితంలో ఆరోగ్యం కోసం కొంత వ్యాయామం కోసం సమయం కేటాయించాలని కోరారు. డిజిటల్ ఆటల నుండి గ్రౌండ్ లో ఆటలు వాడే అలవాటును పిల్లలకు వారి తల్లిదండ్రులే అలవార్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఆర్ ప్రభాకర రావు, డి.సీ.ఆర్.బి డిఎస్పి కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణా ప్రతాప్, ఆర్ ఐ అడ్మిన్ పెద్దన్న, ఆసిఫాబాద్ సీఐ రవీందర్, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ శ్రీధర్, జిల్లా పోలీస్ సంఘం ప్రెసిడెంట్ విజయ శంకర్ రెడ్డి, జనరల్ మేనేజర్ విజయ్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి, సీనియర్ ఆర్తో సర్జన్ డాక్టర్ విశ్వనాథ్, సీనియర్ ఆప్తమాలజిస్ట్, ఇతర ఆర్. ఐ లు, ఎస్.ఐలు , ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.