

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ జనం న్యూస్ మార్చి 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని పాత ముకుందాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వపరిపాలనా దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయు ల వేషధారణ లో పాఠాలు బోధించి ఆకట్టుకున్నారు. డీఈఓ, ఎంఈఓ, ధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులుగా పాఠాలను బోధించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యార్థులు బాల్యం నుండే కష్టపడి ఉన్నత విద్య లు అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రామ్మూర్తి,సిఆర్పి కమల్ల కోటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు సత్తురి బిక్షం, ఉపాధ్యాయులు శ్రీరామ్, నాగార్జున, రవి,విద్యార్థులు పాల్గొన్నారు………….