Listen to this article

జాతర క్రీడలను ప్రారంభించిన సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ.జనం న్యూస్ మార్చ్ 12 వేములపల్లి మండల ప్రతినిధి ముత్యాల సురేష్వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్లు గ్రామంలో కాకతీయ కాలం నుండి ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర జాతర కబడ్డీ, ఎడ్ల పందాల క్రీడలను బుధవారం దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లతో కలిసి సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ ప్రారంభించారు. అంతకుముందు శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో అర్చకులు రెంటాల సతీష్ శర్మ,మణిశర్మ ఆధ్వర్యంలో అర్చనలు,అభిషేకాలు చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లతో కలిసి సబ్ కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కబడ్డీ క్రీడలలో పాల్గొని కబడ్డీ క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. ఫ్రెండ్లీ క్రీడలు నిర్వహించుకోవాలని కోరారు. జాతర భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు బాగున్నాయన్నారు. ఈ దేవాలయం కోరుకుంటే వరాలు ఇచ్చే దేవాలయంగా నిలిచిందన్నారు. అనంతరం దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. శ్రీ రామలింగేశ్వర దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి తాసిల్దార్ పుష్పలత, మాడుగులపల్లి తహసిల్దార్ సురేష్, సిఐ పి అండి ప్రసాద్, ఎస్సై డి వెంకటేశ్వర్లు, దేవాలయ ఈవో మృత్యుంజయ శాస్త్రి, దేవాలయ ధర్మకర్తలు వాకిడి భిక్షం, పెరుమాండ్ల జోజి, ముత్యాల యుగంధర్, లోండ కలమ్మ ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి బంటు చొక్కాయ్య గౌడ్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పత్తిపాటి స్వరాజ్యలక్ష్మి, ప్రవీణ్, కోల సైదులు, సందీప్ నాయుడు, అబ్రహం, కోల మల్లయ్య, వీరేందర్, నార్ల అజయ్,మేక మాణిక్యం, మెరుగు జానీ, పెరుమాండ్ల రమేష్,భయ్యా సైదులు, పేర్ల శంకర్ పెరుమాండ్ల నగేష్,ముండ్ల గంగయ్య, బచ్చు జానయ్య,మేక జయరాజు, మున్న గోపాల్, సలి కొలిమిలా,బిక్షమాచారి, శంకర్, బచ్చు వెంకన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు.