Listen to this article

జిల్లా పోలీసుల ఆధ్వర్యం లో ప్రతిమ హాస్పిటల్ , కరీంనగర్ వారి సహకారం తో జైనూర్ పరిసర ప్రాంత వాసులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు విద్యార్థులు యువత ఉన్నత చదువులు అభ్యసించాలి అపరిచిత, అనుమానాస్పద వ్యక్తుల మాయ మాటలు విని మోసపోవద్దు జనం న్యూస్, మార్చి 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) పోలీసులు మీకోసం ఈ కార్యక్రమం లో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ప్రతిమ హాస్పిటల్ కరీంనగర్ మెడికల్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు ను జైనూర్ పోలీస్ స్టేషన్ వద్ద గల మైదానం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ డివి.శ్రీనివాసరావు ఐపిఎస్, హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు ఎల్లపుడూ అందుబాటులో ఉంటారని , జైనూర్ గ్రామీణ ఆదివాసీ ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సదుపాయం చాలా సుదూరం గా ఉన్నందున , పేదవారికి వైద్యం అందుబాటులోకి తేవాలని ఉద్దేశంతోనే ప్రతిమ హాస్పిటల్ సహకారంతో ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు విద్య వైద్యం అందుబాటులో ఉంటే ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధివైపు అడుగులు వేస్తారని, మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించామని అన్నారు. పాఠశాల విద్యార్థులు యువత ప్రభుత్వ హాస్టల్స్ ను సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు.
యువత చెడు వ్యసనాలకు లోనూ కాకుండా ఉన్నతంగా చదివి గొప్ప స్థాయికి చేరుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు గంజాయి సాగు చేయవద్దని, గంజాయి పంట పండించడం, రవాణా చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తుల మాయ మాటలు విని మోసపోవద్దని, అపరిచిత వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు తారాస పడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో లేదా డయల్ 100 కు కాల్ చేసి తెలపాలి అని అన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పేదల వద్దకే వైద్యం అనే అంశంతో జైనూర్ లో వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలతో మమేకమై సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తామని , ఏ సమస్య ఉన్న పోలీసులకు తెలియజేస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు.ఈ మెడికల్ క్యాంపు లో ప్రతిమ హాస్పిటల్ కరీంనగర్ చెందినడాక్టర్ కౌశిక్, డా. గీత రెడ్డి, డా.అవినాష్ కుమార్ , డా.విశ్వంత్ , డా.శ్రావణ్ కుమార్, డా. రవీనా, డా. రోషన్ రాజ్ లు పాల్గొని 300 మందిని పరీక్షించి, ఈసీజీ, 2 డి ఇకో ,అల్ట్రా సౌండ్ స్కానింగ్ మొదలగు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, జైనూర్ సీఐ రమేష్, పిఎసిఎస్ చైర్మన్ అను పటేల్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, ఎస్ఐ లు గంగన్న, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.