

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 13 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలోని బొడ్డవర చెక్ పోస్టు వద్ద పోలీసులు మార్చి 12న పక్కా సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టి, 70.100కిలోల గంజాయిని, టాటా ఇండికా కారులో అక్రమ రవాణకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లుగా మార్చి 12న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన
మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ వెల్లడించారు. వివరాల్లోకి వెళ్ళి తే.. ఎస్.కోట పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఎస్.కోట సిఐ వి.ఎన్. మూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐ ఎల్.చంద్ర శేఖర్ మరియు పోలీసు సిబ్బంది మార్చి 12న బొడ్డవర చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారన్నారు. ఈ తనిఖీల్లో అరకు వైపు నుండి వచ్చిన డబ్ల్యుబి 06జి 1206 నంబరుగల టాటా ఇండిగో కారులో ఐదుగురు వ్య లు ప్రయాణిస్తున్నారని, తనిఖీల్లో భాగంగా కారు డిక్కీ తెరిచి చూడగా, డిక్కీలో బ్రౌను కలరు టేపులు చుట్టిన 56 గంజాయి ప్యాకెట్లు (70.1కిలోలు) పట్టుబడ్డాయన్నారు. నిందితులను, గంజాయిని రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేసి, పట్టుబడిన నిందితులను ఎస్.కోట పోలీసులు విచారణ చేయగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని ప్రాంతానికి చెందిన షా ఆలం (ఎ-3) మరియు బెంగుళూరు ప్రాంతానికి చెందిన షేక్ అజాజ్ (ఎ-4)లు దుప్పట్ల వ్యాపారం చేస్తూ, వ్యాపారం చేస్తూ అక్కడ ఒడిస్సా రాష్ట్రంకు మల్కనగిరికి చెందిన రంజిత్ బిస్వాస్ (ఎ-1), నిఖిల్ తపాలి, బిశ్వజిత్ మహల్దార్ (ఎ-5)లో పరిచయం ఏర్పడిందన్నారు. నిందితులు ఎ-1 నుండి ఎ-5 ఉత్తర భారత రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణ చేస్తూ, డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో డబ్ల్యుబి 06జి 1206 నంబరు గల టాటా ఇండిగో కారులో ఉత్తర భారత రాష్ట్రాలకు తరలిస్తుండగా మార్చి 12న బొడ్డవర చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఐదుగురు నిందితులు పట్టుబడ్డారని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి 70.1కిలోల గంజాయి, కారు, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.20,300/-ల నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణ నియంత్రణలో సమర్ధవంతంగా పని చేసిన ఎస్.కోట సిఐ వి.ఎన్.మూర్తి, ఎస్ఐ
చంద్రశేఖర్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.
గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు చెక్ పోస్టులు నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్న కారణంగా ఇటీవల గంజాయి పట్టుకోగలుగుతున్నామన్నారు. అదే విధంగా గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు జిల్లాలో పది ప్రాంతాల్లో ఆకస్మికంగా డైనమిక్ వాహన తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్.కోట ఇన్స్పెక్టరు వి.నారాయణమూర్తి, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు పాల్గొన్నారు.