

జనం న్యూస్ మార్చి 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామ శివారులో గల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంను జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి సందర్శించారు. 10 వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను, విద్యార్థుల సామర్ధ్యాన్ని,తరగతి గదుల నిర్వాహణను, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి. 10 వ తరగతి విద్యార్ధుల ను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేసి మంచి ఫలితాలు సాధించాలని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎస్ ఓ మాధవి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జి సి ఈ ఓ సునీత , యం ఈ ఓ గడ్డం బిక్షపతి , ఏకో ఆర్డినేటర్ బి.సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.