Listen to this article

జనం న్యూస్ మార్చి 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎస్సీ వర్గీకరణ లో మాదిగలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ మండల స్టీరింగ్ కమిటీ చైర్మన్ మాదిగ ముక్కెర ముఖేష్ అన్నారు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష రెండవ రోజుకు చేరింది ఈ నిరాహారదీక్ష శిబిరాన్ని దళిత నాయకుడు మాజీ సర్పంచ్ రేణుకుంట్ల‌‌‌ సదయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ముక్కెర ముఖేష్ మాదిగ మాట్లాడుతూ వర్గీకరణ ద్వారా మాదిగలకు రావాల్సిన వాట కంటే రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు 32 లక్షల మంది ఉన్న మాదిగలకు ఏ ప్రాతిపదికన తీసుకున్న 11 శాతం రావాలన్నారు డాక్టర్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదికలో లోపాలను సవరించి ఎస్సీ వర్గీకరణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్దుబాటు చేసుకోవాలనడం సరికాదని నిర్ణయాన్ని పున్ణపరిశీలించి మాదిగలకు న్యాయం చేయాలని తెలిపారు ఈ దీక్ష శిబిరంలో బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు మారెపల్లి మోహన్ నాయకులు కొమ్ముల విజయ్ కుమార్ పెంబర్తి సాంబయ్య మాదిగ పోతుగంటి సాంబరాజు మాదిగ కొమ్ముల సంతోష్ మాదిగ రేణుకుంట్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు….