

జనం న్యూస్ మార్చి 13(నడిగూడెం) నడిగూడెం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ స్థల దాత కొల్లు పాపయ్య వర్ధంతి సందర్భంగా పాఠశాలలోని ఆయన విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు.కొల్లు పాపయ్య దాతృత్వం వెలకట్టలేనిదని, ఆయన పాఠశాలకు ఉచితంగా స్థలం ఇచ్చి ఎంతో మందికి బంగారు బాటలు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మనువడు శత్రుబ్న, మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, వైస్ ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు, దేవబత్తిని రమేశ్ ప్రసాద్ మాజీ సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్, గుండు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.