

జనం న్యూస్ మార్చి 13(నడిగూడెం) మండల ప్రజలు హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని నడిగూడెం మండల ఎస్సై జి. అజయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.హోలీ పండుగను పురస్కరించుకొని మండల ప్రజలకు పోలీసు శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మండల ప్రజలందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో సంప్రదాయాల నడుమ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించుకోవాలని సూచించారు.ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపడం చేయడం నేరమని పేర్కొన్నారు. మండల ప్రజలు సురక్షితమైన సహజ రంగులను వాడి పండుగను నిర్వహించుకోవాలని, రసాయన రంగులను ఉపయోగించవద్దని పేర్కొన్నారు.యువత హోలీ పండుగ అనంతరం చెరువుల్లో లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని సూచించారు. ముఖ్యంగా యువత తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి సరైన పద్ధతి ని తెలియజేయాలని సూచించారు.