Listen to this article

జనం న్యూస్ మార్చి 13 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ మార్క్స్ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య వల్ల మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుండడంతో కాలనీవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ దృష్టికి కాలనీ వాసులు తీసుక వెళ్లడంతో వెంటనే స్పందించి జిహెచ్ఎంసి అధికారులు డీజీఎం శివ కుమార్, మేనేజర్ అరుణ్ తో కలిసి మార్క్స్ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యనుపరిశీలించారు. అధికారులను ఆదేశించి, జిహెచ్ఎంసి యంత్రాంగాన్ని డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.కాలనీలలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు, వెంటనే స్పందించి తగు చర్యలు చేపడతామని కార్పొరేటర్ కాలనీవాసులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డీజీఎం శివ కుమార్ ,మేనేజర్ అరుణ్ , ఎస్ఎఫ్ఏ గోవింద్ హెచ్ఎండబ్ల్యూఎస్ జావిద్ తదితరులు పాల్గొన్నారు