

జనం న్యూస్// మార్చ్// 13 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట ప్రజలకు జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి, హోలీ మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ సందర్భంగా స్థానికులతో మరియు బిర్యానీ పాయింట్ సెంటర్ వారితో మాట్లడారు. రాత్రి 10 గంటల వరకు బిర్యాని సెంటర్ పాయింట్ మూసివేయాలని బిర్యానీ హోటల్ యాజమాన్యం కీ తెలిపారు.అలాగే హోలీ రోజున వాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువ వెళ్లకూడదని రోడ్లపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని, వాహనాలపై వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే నిందితులు ఎంతటి వారైనా, సరే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అన్నారు. ప్రశాంత వాతావరణంలో వారి వారి ఇంటి వద్ద హోలీ సంబరాలు జరుపుకోవాలని, జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి యువత కు ప్రజలకు సూచించారు