Listen to this article

జనం న్యూస్ 13 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా మాజీ ఎంపీ మందా జ‌గన్నాథం భౌతిక‌కాయానికి ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ .సంపత్ కుమార్
నివాళులర్పించారు.హైదరాబాద్‌లోని చంపాపేట‌లోని మందా జ‌గ‌న్నాధం నివాసంలో ఆయ‌న‌ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. త‌న సుధీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో ప్ర‌జ‌ల‌కు ఎన‌లేని సేవ‌లు అందించార‌ని, ఆయ‌న‌ మరణం తీరని లోటని సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసారు.ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా వాసిగా ఆయ‌న‌తో త‌న‌కున్న అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మందా జ‌గ‌న్నాధం ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ మంద జగన్నాథం వర్గీకరణ అంశంపైన కూడా సుదీర్ఘ పోరాటం చేశారని ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడవోకు మన లాంటి వాళ్లకు సముచిత గౌరవం దక్కేది కేవలం కాంగ్రెస్ పార్టీలోని అని అని మందజగన్నదాం సంపత్ కుమార్ చెప్పేవారు అని ఆయన చెప్పిన మాటలో ఆయన బాటలో నడుస్తామని మీడియాకి సంపత్ కుమార్ తెలిపారు.వీరి వెంట ఎక్సైజ్ ,పర్యాటక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు కె.కేశవరావు నాగం జనార్దన్ రెడ్డి ఉన్నారు.