


జనం న్యూస్ తర్లుపాడు మండలం. మార్చి 13. తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామ సచివాలయాన్ని డియల్ డి ఓ కళ్లి శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు సచివాలయం లో ఉన్న ఏయన్ యం ఆశ వర్కర్స్ ని టీకాలు వేస్తున్నారా ఎంతమందికి వేశారు అని అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామం లో సచివాలయ సిబ్బంది చేపడుతున్న పి 4 సర్వే, యం ఎస్ యం ఈ, వర్క్ ఫ్రమ్ హోమ్, డెత్ సిటిజన్ సర్వే చేస్తున్న సిబ్బంది వద్దకు డియల్ డి ఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీ ఓ చక్రపాణి ప్రసాద్, ఇంచార్జీ ఈపిఓఆర్డీ సుభాకర్ సచివాలయ సిబ్బంది చేపడుతున్న సర్వేని దగ్గర ఉండి పర్యవేక్షించారు పి 4,యంఎస్ యం ఈ సర్వే రిపోర్ట్ ఈరోజు లోపు పూర్తి చేయాలనీ సిబ్బందికి తెలిపారు జిల్లా లో తర్లుపాడు సర్వే లాస్ట్ లో ఉందని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పధకాలను అమలు చేసేందుకు సర్వే చేపడుతుందని ఈరోజు చివరి రోజు అని ఎట్టి పరిస్థితులలో పూర్తి చేయాలనీ తెలిపారు తర్లుపాడు సచివాలయం సిబ్బంది కొరత ఉందని వెల్ఫేర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, మహిళ కానిస్టేబుల్, డిజిటల్ అసిస్టెంట్ 4 రు మాత్రమే సర్వే చేయాలంటే పెద్ద పంచాయితీ జనాభా పరంగా కూడా పెద్దది అవడం తో కొరత సిబ్బంది తో సర్వే చేయటం భారంగా ఉందని అధికారి దృష్టికి తీసుకెళ్లారు డి యల్ డిఓ స్పందించి పక్క సచివాలయం లోఉన్న సిబ్బంది నలుగురిని కేటాయించాలని ఎంపీడీఓ కి తెలిపారు ఈకార్యక్రమంలో సచివాలయ సిబ్బంది రమణారెడ్డి,సుధీర్, దుర్గాభవాని,మాధవి పాల్గొన్నారు