

జనం న్యూస్ 13 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం
విద్యానగర్ కాలనీ పంచాయతీ లొ నివాసముంటున్న విలేఖరి శనిగపు లక్ష్మణరావు తన కుమారుడి ఆత్మహత్య నేపథ్యంలో కుటుంబమంతా చాలా మనస్థాపంతో కుంగి పోతున్న తరుణంలో ఈరోజు అట్టి కుటుంబాన్ని సందర్శించి తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ జిల్లా అధ్యక్షులు కురిమెళ్ళ శంకర్,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొప్పుల రమేష్ ప ఓదార్చడం జరిగింది ఈ సందర్భంగా శనిగపూ లక్ష్మణరావు మాట్లాడుతూ నా కుమారుడు రామ్ పవర్ మరణానికి బలమైన కారణం నలంద కాలేజీ యాజమాన్యం అని మరియు నా కుమారుడిని దళితుడు అనే కులవివక్షతోనే స్టార్ బ్యాచ్ నుంచి తప్పించి అనేక కఠినమైన మాటలతో దూషించడం కాలేజీ లెక్చరర్స్ గుండెల మీద దాడి చేయడంతో మనస్థాపం చెందారని తరగతి గదిలో అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఒకే ఒక్కడిని కూర్చోబెట్టి అవమానించారని తెలియజేస్తూ నాకు న్యాయం జరిగే వరకూ మీ తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ అండగా ఉండాలని ప్రాదేయపడినారు