Listen to this article

జనం న్యూస్ మార్చ్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ సర్వకామదాంబ సమేత భోగ లింగేశ్వర స్వామి దేవాలయo లో పౌర్ణమి పాల్గుణ మాసం శుభసమయమున స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ప్రారంభం జరిగిందని దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తెలిపారు. ముందుగా దేవస్థానంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం మరియు నందీశ్వర ద్వజోహరుణ వేద పండితుల పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. తదుపరి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగింపు కార్యక్రమం కొబ్బరికాయ కొట్టి చైర్మన్ ప్రారంభించారు. స్వామివారి పల్లకి ఊరేగింపు అగ్గిమర్రి చెట్టు వీధి, దిబ్బవీధి గంగిరేమిచెట్టు వీధి పెద్దరామస్వామి కోవెల వీధి చిన్న రామస్వామి కోవెల వీధి విల్లూరి జోగి నాయుడు గారి వీధి పల్లపు వీధి సంతోషిమాత వీధి మీదగా స్వామివారి ఊరేగింపు జరిగి దేవస్థానమునకు చేరుకుందని సత్యనారాయణ తెలిపారు. తదుపరి సాయంత్రం 6 గంటలకు వేద పండితులు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఐదు రోజులపాటు స్వామివారి కల్యాణాన్ని నిర్వహిస్తారని 15వ తేదీన పుష్పాంజలి కార్యక్రమంతో ముగింపు జరుగుతుందని చైర్మన్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దాల నారాయణరావు పెంటకోట గణేష్ కుమార్ మల్ల సూరిబాబు రాపేటి సంతోష్ కుమార్ భారీచాకలి నాగేశ్వరరావు శ్రీమతి దూలం సత్యవతి ఈవో బి మురళీకృష్ణ అర్చకులు పేరూరి నారాయణ స్వాత్విక్ శర్మ వేణుగోపాల్ బుజ్జి దేవస్థానం సిబ్బంది మల్ల గణేష్ మాజీ చైర్మన్ కొణతాల కారు బాబు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యల్లపు చంద్రమోహన్ వేగి గౌరేసు కాండ్రేగుల పోతురాజు కాండ్రేగుల వెంకట సూరిబాబు శిలపరిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.