Listen to this article

కోడిపందాలు పేకాటలు చట్టరీత్య నేరం

జనం న్యూస్ 13/01/25
రేగొండ మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా
రిపోర్టర్ ముప్పు భాస్కర్

రేగొండ ఎస్సై సందీప్ రేగొండ ప్రజలను పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు పండగ సెలవులకు హాస్టల్ కాలేజీ నుండి పిల్లలు ఇంటికి వస్తారు మీ పిల్లలు చెరువుల్లోకి బావిలోకి ఈతకు వెళ్లడం ఓవర్ స్పీడ్ తో బైకులు నడపడం చేస్తుంటారు గాలిపటాలు ఎగురవేస్తూ ఇండ్ల పైకి గోడల పైకి ఎక్కుతూ ఉంటారు ఇండ్లపైన విద్యుత్ వైర్లు ఉండడం వలన గమనించక ఆ వైర్లకు తగలడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఓవర్ స్పీడ్ గా వెళ్లడం యాక్సిడెంట్లు అవడం బావిలో చెరువుల్లోకి ఈతకు వెళ్లడం ఈత రాకుండా మునిగిపోవడం జరుగుతుంది దీనివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందుకని మీ పిల్లల నిండు జీవితాలు మీరే పోగొట్టిన వాళ్లు అవుతారు తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల మీరే జాగ్రత్తలు వహించాలని మైనర్లకు బైకుల్ ఇచ్చిన వారి పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని రేగొండ ఎస్సై సందీప్ సూచించారు అలాగే పండుగలకు మీ సొంత ఊళ్ళకి మరియు అమ్మగారింటికి వెళ్లేటప్పుడు మీ ఇంటికి తాళాలు జాగ్రత్తగా వేసుకోగలరు మీ విలువైన వస్తువులు బంగారం వెండి నగదు అన్నీ కూడా మీ వెంట తీసుకెళ్లాలని మరియు బైక్ ల మీద వస్తువులు పట్టుకొని వచ్చి అమ్మే వారి దగ్గర అప్రమత్తంగా ఉండాలని రేగొండ ఎస్ఐ సందీప్ అన్నారు మీరు బైక్ మీద త్రిబుల్ రైడ్ చేయడం గానీ హెల్మెంట్ బండికి సంబంధించిన పేపర్లు లేకుండా ప్రయాణం చేయడం చట్ట రిత్యా నేరమని అన్నారు మరియు ఆటోలు జీపులు కార్లు కెపాసిటీని మించి నడపడం మరియు కోడిపందాలు పేకాటలు బైక్ రేసింగ్లు నేరమని చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని రేగొండ ఎస్సై సందీప్ అన్నారు