

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 13 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ముఖా ముఖిగా గురువారం మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు మాట్లాడారు ప్రజలు విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లను వాడుతున్నారు. వాటిని మురుగు కాలువలలో పడేయడం వలన మురుగు కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీనివలన ప్రజల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 15వ తేదిన అవగాహన ర్యాలీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కాలువలను శుభ్రపరిచే విధంగా సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రధానంగా కుక్కల బెడదలను ఆరు నెలల్లో నివారించేందుకు తగు చర్యలు చేపట్టామన్నారు. నూతన సిసి రోడ్లు, మరమ్మతులు, కల్వర్టు నిర్మాణాలు తగు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకున్నాము: మానుకొండ వారి పాలెం సర్వే నెంబర్ 86 లో సుమారు రెండు ఎకరాలు, పురుషోత్తమ పట్నం శివారులోని సర్వే నంబర్ 343లో నాలుగు ఎకరాలు, మంచినీటి చెరువు రోడు లో సర్వే నంబర్ 349 లో రెండు ఎకరాలు గుర్తించామని, సంబంధిత నిర్వాహకులకు పట్టణ పరిణాళిక విభాగ అధికారుల ద్వారా నోటీసులు జారీ చేయించామన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమిషనర్ తెలిపారు.